శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (16:44 IST)

కేరళలో నటుడు విజయ్.. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ బ్రహ్మరథం

Thalapathy Vijay
Thalapathy Vijay
నటుడు విజయ్ కేరళ చేరుకున్నప్పటి నుండి ఎక్కడికి వెళ్లినా అభిమానులు అతన్ని చూసేందుకు భారీగా వస్తున్నారు. విజయ్ బస చేసిన హోటల్ ముందు అభిమానులు ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. వీలైనప్పుడల్లా విజయ్ ఫ్యాన్స్‌ను ప్రతిరోజు పలకరిస్తూనే ఉన్నాడు.
 
తాజాగా తిరువనంతపురం స్టేడియం చుట్టూ తనకోసం వచ్చిన అభిమానులతో విజయ్ సెల్ఫీ వీడియోని తీసుకున్నాడు. తన సోషల్ మీడియాలో ఆ సెల్ఫీ వీడియోను పంచుకున్నాడు.
 
గోట్ షూటింగ్ కోసం కేరళలో ఉన్న తలపతి విజయ్, వేలాది మంది అభిమానులను పలకరిస్తున్నాడు. ఇంకా విజయ్ కోసం నినాదాలు చేయడంతో తన సిగ్నేచర్ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. సౌత్ సూపర్ స్టార్ తన మలయాళ అభిమానులకు ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'గోట్' షూటింగ్ కోసం విజయ్ కేరళలో ఉన్నాడు. నటుడు 14 సంవత్సరాల తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు.
 
ఇటీవలే, నటుడిని కలిసేందుకు వందలాది మంది అభిమానులు త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వెలుపల గుమిగూడారు. వారితో సెల్ఫీలు దిగేందుకు విజయ్ బస్సు పైకి ఎక్కుతూ కనిపించాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.