సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:39 IST)

నాగిని డ్యాన్స్‌-అదరగొట్టిన సన్నీ లియోన్.. వీడియో వైరల్

ప్రస్తుతం టిక్‌టాక్ యాప్ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను సైతం కట్టిపడేస్తోంది. డ్యాన్స్, సింగింగ్..అలాగే ఇంకేదైనా తమకు ఉన్న స్కిల్స్‌ను బయటపెట్టేందుకు టిక్‌టాక్ యాప్‌ని తెగ వాడేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్స్‌లు చేయడం, సినిమా డైలాగ్‌లకు లిప్ మూమెంట్ లాంటివి చేస్తూ నెటిజన్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. 
 
ఇప్పుడు ఈ టిక్‌టాక్ ఫీవర్ బాలీవుడ్ నటులకు సైతం పాకింది. మొన్న జాక్వెలీన్ ఫెర్నాండెస్, నిన్న నేహా కక్కార్.. తాజాగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ టిక్‌టాక్ వీడియో యాప్‌లో ప్రత్యక్షమైంది.
 
సన్నీ లియోన్ నాగిని డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేసింది. పాపులర్ డ్యాన్సర్, స్వప్న చౌదరి హిట్ సాంగ్‌కు సన్నీ హుషారైన స్టెప్పులు వేస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. థెరీ అఖ్యా కా యో కాజల్ అనే సూపర్ హిట్ హిందీ సాంగ్‌కి తన స్నేహితురాలితో కలిసి సన్నీ నాగిని డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను అలరించింది. సన్నీ నాగిని డ్యాన్స్ చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.