గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:50 IST)

భీమ్లా నాయక్ మాస్ జాతరకు వెయిటింగ్ : వరుణ్ తేజ్

Varun tej- pawan
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. Renaissance పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌లో సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. 
 
కానీ, అదే రోజు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రానుండటంతో గని సినిమాను వాయిదా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. ‘మా ‘గని’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండటంతో.. మా  సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాస్ జాతర థియేటర్స్‌లో చూడ్డానికి మీలాగే మేం కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ‘గని’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం..’ అంటూ తెలిపారు.