శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:12 IST)

భీమ్లా నాయ‌క్ రాక‌తో ఆడవాళ్లు మీకు జోహార్లు విడుద‌ల తేదీ మారింది

Sharwanand, Rashmika
హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అప్ప‌టికీ భీమ్లానాయ‌క్ వ‌స్తుందోరాదో అన్న డౌట్‌లో నిర్మాత‌లు వున్నారు. ఆ త‌ర్వాత భీమ్లా నాయ‌క్ 25న క‌న్‌ఫామ్ అన‌గానే శ‌ర్వానంద్ డేట్ మారిపోయింది.
 
మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికేట్ ల‌భించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది.  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు  విడుద‌ల చేసిన మూడు పాట‌ల‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.