గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 జనవరి 2016 (14:17 IST)

ఎక్స్‌ప్రెస్ రాజాతో సురభికి లక్కే.. అలాంటి సినిమాల్లో నటించాలనుందట!?

బీరువా సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కొత్తమ్మాయి సురభీకి ఆ సినిమా అంత గుర్తింపు సంపాదించిపెట్టలేదు. అయితే ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో సురభీకి మంచి క్రేజ్ లభించింది. శర్వానంద్‌తో జోడీ కట్టిన వేళ అమ్మడికి మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ రాజా హిట్‌తో సురభి రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసేసినా.. సురభికి ఢిల్లీలో మాత్రం ఆమె ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్సే ఆమె హీరోయిన్ అంటే నమ్మట్లేదట. 
 
ఢిల్లీలో ఫైన్ ఆర్ట్స్ ముగించిన ఈ భామ ఇప్పటిదాకా తాను హీరోయిన్‌గా నటిస్తున్నట్లు.. మరిన్ని సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఇంట్లో, స్నేహితులతో చెప్పనేచెప్పలేదట. అయితే ఎక్స్‌ప్రెస్ రాజాతో తాను హీరోయిన్ అయ్యాననే విషయాన్ని చెప్పినా వారు నమ్మట్లేదట. 
 
ఇక తన స్నేహితులకు తన ఫోటోలు.. పోస్టర్లు చూపిస్తుంటే.. వారూ నమ్మట్లేదట. సో.. తప్పకుండా ఓ హిట్ సినిమా కొట్టి తన బంధువులు, స్నేహితులకు తాను హీరోయిన్ అయ్యాననే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటోంది.. అందాల సురభి. అంతేకాదు.. బాజీరావు మస్తానీ, జోధా అక్బర్ లాంటి ఎపిక్ రొమాంటిక్ సినిమాల్లో నటించాలనుందని తెలిపింది. ప్రస్తుతం కృష్ణగారి గది వీర ప్రేమ గాధ సినిమాలో సురభి నటించింది. తమిళంలో పుగల్ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.