బుధవారం, 5 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (15:08 IST)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

Nithin, GV Prakash Kumar, Divya Bharathi
Nithin, GV Prakash Kumar, Divya Bharathi
హీరో జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా ''కింగ్స్టన్'' మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. దివ్యభారతి, జీవీ ప్రకాష్ జంటగా కనిపించబోతున్నారు. ఈ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో మార్చ్ 7న రిలీజ్ చేయబోతున్నారు.

గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సోమవారం రాత్రి ''కింగ్స్టన్'' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి,  మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గెస్ట్ లుగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ 'కింగ్స్టన్' ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి.  ఇలాంటి స్పెక్టాకులర్ విజువల్స్ అందించినందుకు డైరెక్టర్ కమల్ కు అభినందనలు. ట్రైలరే ఇలా ఉంటే, ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. నేను ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.  ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఇది ఫస్ట్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. సినిమా ఖచ్చితంగా బాగుండాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్య మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు. మీలాంటి అమ్మాయిలు క్యూట్ క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాలాంటి అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. మీ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవాలి. నాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేశ్వర్ రెడ్డి గారు ఈ మూవీని తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఆయనకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, రాబిన్ హుడ్ మూవీ కూడా ఇదే మంత్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రెండు లవ్ పాటలు రిలీజ్ చేసాము. త్వరలోనే ఒక అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అది నా ఫేవరెట్. నిర్మాత రవిశంకర్ తో 'రాబిన్ హుడ్' మూవీని స్టార్ట్ చేశాను. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి కూడా పని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడదాకా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థాంక్స్ రవి గారు. మూవీని రిలీజ్ చేయబోతున్న డిస్ట్రిబ్యూటర్లు, గంగ ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి  థాంక్స్. నేను ఫస్ట్ కరుణాకరన్ సార్ తో ప్రభాస్ నటించిన 'డార్లింగ్' మూవీతో తెలుగు జర్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా' లాంటి సినిమాలు కూడా చేశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా 'వాతి'తో రీస్టార్ట్ చేశాను.. 
 
ఈ సినిమాలోని 'మాస్టారు' సాంగ్ తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయింది. ఐయాం వెరీ గ్రేట్ ఫుల్ టు యు. 'కింగ్స్టన్' మూవీ ఒక బిగ్ డ్రీమ్. నిర్మాతగా ఇది నా ఫస్ట్ మూవీ. 'హ్యారీ పోటర్' లాంటి మల్టీ యూనివర్స్ సినిమాలు చూసినప్పుడు డ్రీమ్ లోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి, ఈ మూవీని తీసాను. కానీ ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టలేదు. అలాంటి స్టాండర్డ్స్ ఉన్న విజువల్స్ వండర్ మూవీని తీయాలని అనుకున్నా. 'కింగ్స్టన్' దానికి కేవలం స్టార్టింగ్ పాయింట్. త్వరలో చాలా పార్ట్స్ రాబోతున్నాయి. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ కి ఇదొక డ్రీం ప్రాజెక్ట్. మాతో అసోసియేట్ అయినందుకు, ఈ మూవీని కో-ప్రొడ్యూస్ చేసినందుకు జీ స్టూడియోస్ వాళ్లకు థాంక్స్. కంప్లీట్ యాక్టింగ్ టీం, టెక్నికల్ టీం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ థాంక్స్. 'బ్యాచిలర్' తర్వాత దివ్యభారతి, నా కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇదే. మీ అందరికీ ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇదొక బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన సినిమా. ఈ మూవీని మార్చి 7న అందరూ థియేటర్లలో చూడండి. తెలుగులో రిలీజ్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చారు.
 
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ "'కింగ్స్టన్' టీజర్ ని జీవీ ప్రకాష్ కుమార్ 7-8 మంత్స్ బ్యాక్ చూపించారు. ఆయన చెప్పిన బడ్జెట్, విజువల్స్ చూసి షాక్ అయ్యాం. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ప్రపంచంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు కదా అన్నంత మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇలాంటి అద్భుతమైన మూవీని థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సంవత్సరాల తరబడి ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో... కరోనా టైం నుంచి బెస్ట్ క్వాలిటీ తీసుకురావడానికి ఈ సినిమాపై పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందినట్టుగా అనిపిస్తోంది. ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.