శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (10:17 IST)

జీవితమే ఓ సర్కిల్ అనే పాయింట్ నచ్చి నటించాం: అర్షిణ్‌ మెహతా,రిచా పనై

Arshin Mehta, Richa Panai
Arshin Mehta, Richa Panai
దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త  థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన తమ అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నాయికలు అర్షిణ్ మెహతా, రిచా పనై.
 
అర్షిణ్ మెహతా మాట్లాడుతూ - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు భాష రాదు కాబట్టి సెట్ లో ఇబ్బందిపడేదాన్ని. కానీ డైరెక్టర్ తో సహా టీమ్ చాలా సపోర్ట్ చేసి నేను బాగా నటించేలా చూసుకున్నారు. మన జీవితం అంటే మంచీ చెడుల సర్కిల్. ఈ చిత్రంలోనూ అదే విషయాన్ని చెప్పబోతున్నాం. సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాము. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.
 
రిచా పనై మాట్లాడుతూ - కెరీర్ లో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్ ఎహె వంటి చిత్రాల్లో నటించాను. బృందావనమది అందరిదీ సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఇది జూలై 7న రిలీజ్ కు వస్తోంది.  ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరో లైఫ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆయన వెంట మేముంటాం. నేను పెయింటర్ పాత్రలో కనిపిస్తా. ఇవాళ అమ్మాయిలు ఎంత మోడరన్ గా, ఫ్రీడమ్ తో ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తా. రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్ టైనింగ్..ఇలా కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాంటేజ్ సాంగ్స్ ఆకర్షణ అవుతాయి. షూటింగ్ టైమ్ లో నేను, అర్షిణ్, సాయి రోనక్ స్టూడెంట్స్ లా నీలకంఠ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్  జరుగుతున్నాయి.