శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (19:49 IST)

నేషనల్ అవార్డ్ విజేత నీలకంఠ సినిమా సర్కిల్

Neelakanta, Sai Ronak and others
Neelakanta, Sai Ronak and others
టాలీవుడ్ డైరెక్టర్ నీలకంఠ తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో "షో" అనే ఫీచర్ ఫిల్మ్ తో రెండు జాతీయ అవార్డులు, అలాగే "విరోధి" మరియు "షో" చిత్రాలకు గాను ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయిన దర్శకుడు నీలకంఠ ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి  సినిమా లతో ఆకట్టుకున్నారు. సినిమాల నుండి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి "సర్కిల్" అనే చిత్రంతో వస్తున్నారు. "ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. 
 
తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో నుంచి ఈవెంట్ లో డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ, "సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్ మరియు సర్కిల్ ఆఫ్ ఫేట్ అని మనకి పోస్టర్ డిజైన్ లో కనిపిస్తాయి. ఈ మూడిటి కలయిక గురించి చెప్పేది ఈ సినిమా. తన పాత్రలోని ఎమోషన్స్ని సాయిరోనక్ నాకు చాలా బాగా చూపించాడు తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి లాగబడతాడు. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. ఈ ప్రాబ్లమ్స్ ని దాటుకుని తను బయటకు రాగలిగాడా లేదా అనేది సినిమా కథ సినిమాలో ఎమోషన్స్ ని చాలా సరికొత్తగా చూపించాము," అని చెప్పారు.
 
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, "డైరెక్టర్ నీలకంఠ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా షూటింగ్ తర్వాత వేరే సెట్స్ మీదకి వెళుతుంటే వాళ్ళు నన్ను నువ్వు ఎలా ఇంత ఫోకస్ గా ఉంటున్నావు అని అడుగుతున్నారు. ఒక్కసారి నీరకంఠ గారితో సినిమా చేస్తే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సినిమాలో నాది ఒక ఫోటోగ్రాఫర్ పాత్ర. సినిమా టీజర్ తో పాటు సినిమా కూడా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను," అని అన్నారు. 
 
బాబా భాస్కర్ మాట్లాడుతూ, "నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ నీలకంఠ గారికి మరియు నిర్మాతలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సినిమా మొత్తం ఒకే ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా పనిచేశారు. అసలు నేను నటించగలనా అని నాకు అనుమానం ఉండేది కానీ డైరెక్టర్ నీలకంఠ గారు నా మీద నమ్మకం ఉంచి నేను నటించేలా చేశారు. జీవితం అంటేనే ఒక సర్కిల్ లాంటిది. దాని గురించి చెప్పే ఈ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 
 
నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ, "ఏ రోజు ఏది ఎలా చేయాలి అని మేము చెప్పలేదు. సినిమా విషయంలో డైరెక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాము. మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది" మా మొదటి సినిమా నీలకంఠ గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. 
 
ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సర్కిల్ చిత్రంలో నటీనటులు: సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ..