కీరవాణి రాకతో మాకు భయం పోయింది- ఎన్.టి.ఆర్.
`రెండున్నల సంవత్సరాల క్రితం కళ్యాన్ ఫోన్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను. ఒకసారి నువ్వు వింటే బాగుంటుందని చెప్పాడు. వశిష్ట (వేణు) పలుసార్లు కలిశాడు. ఆరోజు తను ఒక ఐడియాతో బింబిసార కథ చెప్పాడు. ఆరోజు భయం మొదలైంది. అనుభవంలేని దర్శకుడు. పెద్దచిత్రాన్ని ఎలా డీల్ చేయగలడు అనే బెరుకుగా వుంది. ఆ తర్వాత సినిమా చూశాను` అని ఎన్.టి.ఆర్. జూనియర్ తెలిపారు.
బింబిసార ప్రీరిలీజ్ శిల్పకళావేదికలో జరిగింది. అభిమానులు వర్షంలోనూ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్.టి.ఆర్. మాట్లాడుతూ, అనుభవం లేని దర్శకుడు బింబిసారను ఎలా తీస్తాడనే అనుమానం సినిమా చూశాక పోయింది. ఎంత కసితో కథను చెప్పాడే అంతకంటే గొప్పగా సినిమా తీశాడు. అదే ఎగ్జైట్‌మెంట్‌కు మీరు గురవుతారు. ఈ చిత్రానికి ఛోటా కెనాయుడు కెమెరా అద్భుతం. అన్నీ వున్నాయి ఏదో వెలితి మాకు అనిపించింది. ఆ వెలితి ఎవరోకాదు ఎం.ఎం. కీరవాణి. బింబిసారకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు వెన్నెముకగా నిలిచారు. దాతో మాకు భయంపోయి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆతృత కలిగింది.
- ఇదే వేదికపై నేను ఓ మాట చెప్పాను. మీకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే వుంటాం. నచ్చకపోతే ఇంకొకటి, మరోటి ఇలా మీరు కాల్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. బింబిసార చిత్రం చూసిన తర్వాత కళ్యాణ్‌రామ్ కాలర్ ఎత్తేలా మీరు చేస్తారు. కళ్యాణ్‌రామ్ కంటే బింబిసార చిత్రానికి న్యాయం చేసేవాడు ఇంకొకరు లేడు అని అన్నారు. ఆ వెంటనే కళ్యాణ్‌రామ్.. తమ్ముడు ఎన్.టి.ఆర్.ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు.