గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (11:35 IST)

వాల్తేర్‌ వీరయ్యలో పూనకాలు పాటను పిచ్చిపిచ్చిగా రాశాం : దేవీశ్రీప్రసాద్‌

Devisriprasad
Devisriprasad
సినిమాలకు పాటలు రాయాలంటే ముందుగా ట్యూన్‌ను విని రచయిత, సింగర్ పాటకు ఓ అందాన్ని తెస్తారు. కానీ ఎటువంటి ట్యూన్‌, లిరిక్‌ కూడా లేకుండా ఓ పాట రాయాలి. అది కూడా మెగాస్టార్‌ చిరంజీవికి రాయాలి. అందులో రవితేజ కూడా వుంటాడు. అందుకే సంగీత దర్శకుడికి ఎంతగా ఆలోచించినా క్లారిటీ రాలేదు. అప్పుడు ఏదో పిచ్చిపిచ్చిగా రాసేస్తేపోలా అని అనుకుని రోల్‌రౌడాకు ఈ విషయం చెప్పాడట. సినిమా ఎవరికీ, ఎందుకు అనే సన్నివేశం చెప్పకుండా.. నీకు నచ్చిన విధంగా పిచ్చిపిచ్చిగా పాట రాసేయి. అవసరమైతే పాడి వినిపించు. అయితే ఇది మాస్‌ సాంగ్‌లా వుండాలి అనడంతో రోల్‌రైడా మాస్‌ పాటలు, జాతరలలో పాడేవాటిని మైండ్‌లో తీసుకుని రాసేసి, పాడి డి.ఎస్‌.పి.కి వినిపించాడట. అప్పుడు కొద్దిగా ట్యూన్‌ను డి.ఎస్‌.పి. బయటపెట్టాడు. అలా ‘పూనకాలు పాట పుట్టుకొచ్చింది.. అని దేవీశ్రీప్రసాద్‌ తాజాగా తెలియజేశారు.
 
ఇందులో ప్రత్యేకత ఏమంటే, ఈ పాటలో సరికొత్త వాయిద్యం కావాలి. అది కూడా చిత్రంగా వుండాలని.. పపప.పప.పప. అనేవిధంగా ఓ బూరను తీసుకున్నాడు. దానికి ఓ కథ వుంది. డి.ఎస్‌.పి. గోవా వెళ్ళినప్పుడు ఓ షాప్‌కు వెళ్ళి అక్కడ చిన్నపిల్లల ఐటమ్స్‌లో బూర చూశాడు. అది ఊదితో బలేగా వుందనిపించింది. అందులో రకరకాల కలర్స్‌ చూశాడు. గ్రీన్‌ కలర్‌ బాగా నచ్చింది. అది కూడా కిరోసిన్‌ పోసే గరాటాలాగా వుంది. దాన్ని తీసుకుని ఊది ‘పపప..పపప.’ అంటూ శబ్దాన్ని చేసి దర్శకుడు బాబీకి వినిపించాడు. అప్పటికే పాట పూనకాలు తేవాలన్నట్లు హిట్‌ ఇవ్వడంతో ఇదే కరెక్ట్‌ అని డిసైడ్‌ అయిపోయారు. అది పాటకు ఫుల్‌ మాస్‌ జోష్‌ను ఇచ్చింది. ఇది రవితేజ, చిరంజీవికి బాగా నచ్చింది. అలా పాట పుట్టుక గురించి డి.ఎస్‌.పి. చెప్పాడు.

ఆ పాట, ఈ కిరోసిన్‌ గరాటాను వాల్తేర్‌ వీరయ్య ప్రీరిలీజ్‌ రోజు ఆడియన్స్‌ ముందు పాడి జోష్‌ తెప్పిస్తానని చెప్పాడు.