ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:31 IST)

వెంకీ మామ‌కి ఏమైంది..? అస‌లు ఈ మూవీ వ‌చ్చేది ఎప్పుడు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగచైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 4న రిలీజ్ చేయాలి అనుకున్నారు. 
 
మెగాస్టార్ సైరా మూవీ వచ్చినా కూడా ఈ డేట్‌కు రావాలని ఆరంభంలో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.... షూటింగ్ ఇంకా బ్యాల‌న్స్ ఉండ‌డం... సైరా భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డం... దీనికి పోటీ వేయ‌లేని ప‌రిస్ధితి. అందుచేత దీపావళి సందర్భంగా అక్టోబర్ 25 అన్న డేట్ తెర పైకి వచ్చింది. అప్పటికి ఆ డేట్ సోలో. కానీ ఇప్పుడు ఆ డేట్ ఫుల్ టైట్. 
 
విజయ్-అట్లీ కాంబినేషన్లోని విజిల్, కార్తీ తమిళ డబ్బింగ్ సినిమా, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాలు వస్తాయని తెలిసింది. అందుకే వెంకీమామ మళ్లీ మరో డేట్ చూసుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంకో డేట్ అంటే ఎప్పుడంటారా..? డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అభిమానులు బాగా ఫీల‌వుతున్నార‌ట‌. మ‌రి... ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా రిలీజ్ డేట్‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూద్దాం.