శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (15:13 IST)

'అక్కినేని' ఇంటి కోడలు ఎందుకు అంతలా రెచ్చిపోతోంది?

టాలీవుడ్ హీరోయిన్ సమంత కాస్త అక్కినేని ఇంటి కోడలుగా మారిపోయింది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను పెళ్లాడింది. ప్రస్తుతం వీరిద్దరూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో సమంత ఎక్స్‌పోజింగ్‌లో రెచ్చిపోతున్నారు. బికినీలు, టూపీస్ దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ, కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 
 
నిజానికి ఈ అమ్మాడు పెళ్లికి ముందు పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేసిన దాఖలాలు లేవు. కానీ, ఈ మధ్యకాలంలో మాత్రం ఈ అమ్మడును పట్టలేకపోతున్నారు. రెగ్యుల‌ర్‌గా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కు కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంది. 
 
ఎవ‌రేమ‌నుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తుంది. ముఖ్యంగా, ఇటీవల తన భర్త చైతో కలిసి మాల్దీవుల‌కి వెళ్లిన‌ప్ప‌టి నుంచి స‌మంత గ్లామ‌ర్ షోకు అడ్డంకులు లేకుండా పోయాయి.
 
మాల్దీవుల్లో బికినీతో దిగిన ఫొటోని షేర్ చేసి ర‌చ్చ‌చేసిన స‌మంత త‌ర‌చుగా క్లీవేజ్ షో ఫొటోస్ లేదంటే కాస్త హాట్‌గా ఉన్న పిక్స్‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల‌పై కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ అక్కినేని కోడ‌లు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. 
 
గత 2021లోనూ ఇది కొన‌సాగుతుంద‌ని హింట్ కూడా ఇస్తుంది. ప్ర‌స్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫాం 'ఆహా'లో ప్రసారమయ్యే "సామ్ జామ్" అనే టాక్ షోతో బిజీగా ఉన్న సమంత త్వ‌ర‌లో 'ది ఫ్యామిలీ మెన్ 2' అనే వెబ్ సిరీస్‌లోను న‌టించ‌నుంది. 
 
మ‌రోవైపు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లంలో క‌థానాయిక‌గా స‌మంత పేరు వినిపిస్తుండ‌గా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.