గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (16:10 IST)

ఈసారి రాధే శ్యామ్ జాత‌కం ఫ‌లిస్తుందా!

Radhe Shyam
ఆర్‌.ఆర్‌.ఆర్‌., రాధే శ్యామ్ చిత్రాలు సంక్రాంతి లిస్ట్‌లో హాట్ టాపిక్ గా మారాయి. క‌రోనా వ‌ల్ల మొత్తంగా వాయిదా ప‌డింది. అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి ముందుగానే రాజ‌మౌళి రిలీజ్ వాయిదా అని ప్ర‌క‌టించారు. కానీ రాధే శ్యామ్ మాత్రం చాలా ఆల‌స్యంగా రిలీజ్ డేట్ వాయిదా అని ప్ర‌క‌టించింది. ఇప్పుడు కూడా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాను మార్చి, ఏప్రిల్ రెండు డేట్‌ల‌ను ప్ర‌క‌టించి సేఫ్ సైడ్‌గా మిగిలిన సినిమాలు అడ్డ‌లేకుండా చేసుకుంది.
 
కానీ ఇప్ప‌టివ‌ర‌కు రాధే శ్యామ్ మ‌రో డేట్‌ను ప్ర‌క‌టించలేదు. అస‌లే జాత‌కాల‌పై క‌థ కాబ‌ట్టి జ్యోతిష్కుడు చెప్పిన సారాంశం బ‌ట్టి ఈ ఏడాది జూన్ లోప‌ల విడుద‌ల‌వ్వాల్సి వుంది. అందుకేమో ఇంకా ఆల‌స్యం చేస్తున్నారు. తాజాగా రాధే శ్యామ్ సినిమా డేట్‌ను ప్ర‌క‌టించేదిశ‌గా చిత్ర నిర్మాత‌లు వున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు మార్చి 11వ తేదీ అనుకూలంగా వున్న‌ట్లు తెలుస్తోంది. దానిపై ఇంకా అధికార ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. న‌లుగురు సంగీత దర్శకులు బాణీలు స‌మ‌కూర్చిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్  నిర్మించింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.