గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (12:56 IST)

కేజీఎఫ్ హీరో మొగ్గిన మనస్సుకు 18 ఏళ్లు.. కేజీఎఫ్2 కోసం వెయిటింగ్..

కన్నడ రాకింగ్ స్టార్ యష్ తొలి సినిమా మొగ్గిన మనస్సు విడుదలై 12 సంవత్సరాలైంది. జూలై 18నాటికి ఈ సినిమా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే యశ్ సతీమణి రాధికా పండిట్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.

2008లో విడుద‌ల‌యిన మొగ్గిన మ‌న‌సు సినిమా రొమాంటిక్ డ్రామా. య‌శ్‌, రాధికా పండిట్ క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌శాంక్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కావ‌డంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది
 
ఈ క్రమంలో రాకీ, గోకుల. మొదల సాల, రాజధాని, కిరాతక, డ్రామా, గజకేసరి, గూగ్లీ, రాజాహులి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా తొలిసారి కలిసి నటించిన హీరోయిన్‌తోనే యష్ ప్రేమ వివాహం జరిగింది. ఇక కేజీఎఫ్ సినిమాతో యష్ నేషనల్ వైడ్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్' చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
 
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని.. ఒక స్క్రాప్ నుంచి తారాస్థాయికి వచ్చానని యష్ అన్నాడు. అలాగే కేజీఎఫ్ చాప్టర్ -2 షూటింగ్ కొంత బ్యాలెన్స్ వర్క్ వుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెప్పాడు.