శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:46 IST)

మొన్న అవమానం - నేడు ఘన సన్మానం దక్కించుకున్న జానీ మాస్టర్

Jony master, ayesha
Jony master, ayesha
ఇటీవలే కొరిియోగ్రాఫర్ జానీ మాస్టర్..పై అభియోగాలు మోపుతూ తోటి అసోసియేషన్ సభ్యులు సురేష్ పెద్ద రాద్దాంతమే చేశాడు. జానీమాస్టర్.. ఇక్కడివాడు కాదనీ,  ఆయన సభ్యులను ఎదగనీయకుడా డాన్సర్స్ అసోసియేషన్ నాయకుడిగా డబ్బులు పంచి అధ్యక్షుడుగా అయ్యాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా లిఖితపూర్వకంగా అతను పంపాడు. అయితే ప్రస్తుతం ఆయన్ను కేంద్ర ప్రభుత్వం వ్రుత్తిపరంగా గౌరవాన్ని ఆపాదించేలా అవార్డు ప్రకటించింది. 
 
ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం సినిమాలోని మేఘం కరుగత పాటకు అవార్డ్ గెల్చుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయనకు ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఫిలింఫెడరేషన్ నాయకులు సురేష్ మాట్లాడుతూ - డ్యాన్స్, ఫైట్స్ క్రాఫ్ట్ ల్లో మనం ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ అవమానాలను ఎదుర్కొని నిలబడి ఈ రోజు జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి ఎదిగాం. మనకు జాతీయ అవార్డ్ తీసుకొచ్చిన జానీ మాస్టర్ గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. జానీ మాస్టర్ సాధించిన జాతీయ అవార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఆయన ఇచ్చిన స్పూర్తితో మన డ్యాన్సర్స్, ఇతర క్రాప్ట్ లు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తాయని కోరుకుంటున్నా. అన్నారు.
 
జానీ మాస్టర్ మాట్లాడుతూ - ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులు మమ్మల్ని ఎప్పుడూ బాగా సపోర్ట్ చేస్తుంటారు. సినిమాకు ఆది అంతం నిర్మాతే. ఆయన లేకుంటే హీరోలు కూడా లేరు. నిర్మాత క్యాషియర్ గా ఉండటం చూస్తున్నాం. కానీ ఆయన కూడా హీరోలాగే ఉండాలి.  ప్రభుదేవా గారు చేసిన వెన్నెలవే వెన్నెలవే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇలాంటి పాట ఒకటి నేనూ చేయాలనే కలగనేవాడిని. ఆ అవకాశం ధనుష్ గారి తిరుచిత్రాంబలంతో నాకు దక్కింది. అక్కడ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసేందుకు నన్నే పిలిపించారు ధనుష్ గారు. ధనుష్ గారికి, తిరుచిత్రాంబలం మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం అంటే అందుకు ముక్కురాజు మాస్టర్, నా ముందున్న డ్యానర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషే కారణం. ముక్కురాజు మాస్టర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్ ను ఇక్కడికి తీసుకొచ్చి అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా నడుస్తూ ముందుకెళ్తున్నాం. మన మాస్టర్స్ ఎన్నో ట్రెండీ స్టెప్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు డ్యాన్స్ మాస్టర్స్ కు బాగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు. నాకు నేషనల్ అవార్డ్ రాగానే డిఫ్యూటీ సీఎం పవన్ గారు అభినందిస్తూ మెసేజ్ పంపారు. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఏది సాధించినా ఆ క్రెడిట్ నన్ను ప్రోత్సహించిన మా అమ్మా నాన్నలకే చెందుతుంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. అన్నారు.