శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By
Last Modified: శుక్రవారం, 11 జనవరి 2019 (20:14 IST)

క్రిష్ అందుకే తప్పుకున్నారు... కంగనా రనౌత్ 'మణికర్ణిక' రికార్డు సృష్టిస్తుందా?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రంతో ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. నిజానికి ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాల్సి వుంది. కానీ, ఆయన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని అంగీకరించడంతో తప్పుకున్నారు. దీనితో మణికర్ణిక చిత్రం వాయిదా పడే పరిస్థితి వచ్చింది. దీనిపై కంగనా రాజీపడలేదు. క్రిష్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను తనే నెత్తిన వేసుకుంది. ఐతే కొంతమేర ఆయన దర్శకత్వం వహించడంతో టీజర్లో ఆయన పేరు కూడా కనబడుతోంది.
 
ఈ చిత్రం గురించి కంగనా స్పందిస్తూ, ఒక సినిమాకు దర్శకనటిగా వ్యవహరించడం అంత తేలికైన పని కాదని, అందుకు ఎంతో అంకితభావం అవసరమన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
 
'ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూనే, దర్శకురాలిగా ఉండటం చాలా కష్టమైన పని. కానీ నా అదృష్టం కొద్ది క్రిష్‌ సహాయం చెయ్యడం వల్ల కథపైన ఎక్కువ దృష్టి పెట్టాను. నటులు షాట్‌ అయిన తర్వాత కేరవన్‌లోకి వెళ్లి రిలాక్సవుతారు. కానీ దర్శకురాలిని కాబట్టి ఆ తర్వాత కెమెరా దగ్గరకు వచ్చి నుంచునేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విజయీభవ పాటకు మంచి స్పందన వచ్చింది. మరి విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.