సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (12:54 IST)

బాహుబలి రికార్డులను 2.0 బ‌ద్ద‌లు కొడుతుందా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం 2.0. గ్రేట్ డైర‌క్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 29న రిలీజ్ కానుంది. దాదాపు 500 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెండి తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర కూడా చాలా బలంగా కనిపిస్తుండంతో మ‌రింత క్రేజ్ పెరిగింద‌ని చెప్ప‌చ్చు.
 
దానికి తోడు 3Dలో కూడా విడుదల కాబోతుండడంతో భారీ వసూళ్లనే రాబట్టేటట్టు ఉంది అని సినీ పండితులు అంటున్నారు. ఖచ్చితంగా బాహుబలి రికార్డులకు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయమని తెలుస్తుంది. ఎందుకంటే బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 9000 థియేటర్లలో విడుదలయ్యింది. అప్పటివరకు భారతీయ సినీ చరిత్రలోనే అదే పెద్ద రికార్డ్. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి 2.0 చిత్రం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 11,000 థియేటర్లలో విడుదలవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. 
 
బాహుబలి 2ని మించి థియేటర్లలో విడుదలవ్వడం దానికి 3D టెక్నాలజీ కూడా తోడవడంతో మొదటి రోజు మాత్రం బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుదో చూడాలి.