హీరో సిద్ధార్థ్ టక్కర్ ఎలా ఉందంటే రివ్యూ
చాల కాలం తర్వాత హీరో సిద్ధార్థ్ తెలుగు, తమిళ సినిమాతో ఈ రోజు టక్కర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నటుడిగా వేలు పెట్టాల్సిన పనిలేని హీరో సిద్ధార్థ్ ని అతని స్నేహితుడు కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. ఈరోజు విడుదలైన సినిమా ఎలావుందో చూద్దాం.
కథ:
గుణ శేఖర్ (సిద్ధార్థ్) పుట్టినప్పుడు పేదవాడిగా పుట్టినా చచ్చేలోపల పెద్ద ఆస్తిపరుడు కావాలని బలమైన కోరికతో అమ్మతో గొడవపడి ఊరు నుంచి వైజాగ్ వస్తాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నిందలు భరించలేక ఓ బెంజ్ కారున్న ఓనర్ దగ్గర డ్రైవర్‌గా జాయిన్ అవుతాడు. ఓసారి సిటీలో డబ్బులున్న అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ సభ్యులు గుణ శేఖర్ కారు ఎక్కుతారు. చివరికి పోలీసులు తరుముతున్నా డబ్బు ఆశతో గ్యాంగ్ సభ్యులు కాపాడటానికి డేర్ చేస్తాడు. కానీ వాళ్ళు బాగా కొట్టి హ్యాండ్ ఇస్తారు. ఆతర్వాత తన మనసు పడ్డ తాన్యా (దివ్యాంశ కౌశిక్)ను కలిసే క్రమంలో గుణ శేఖర్ నడుపుతున్న బెంజ్ కారు ప్రమాదానికి గురై పాడవుతుంది.
ఆ కారు ఓనర్ శాడిస్టు. బాగా కొట్టి. 7 ఏళ్ళు జీతం లేకుండా పని చేయాలని కండీషన్ తో లెటర్ రాయించుకుంటాడు. ఈ రెండు అవమానాలు తలుచుకుని గుణ చనిపోవాలని ప్రయత్నిస్తాడు.. కానీ చావలేదు. ఇలాకాదు అనుకోని కిడ్నాప్ గ్యాంగ్‌తో గొడవపడితే వాళ్ళే చంపేస్తారని వాళ్ళున్న డెన్ కు వెళతాడు. కానీ అక్కడ గుణ అందరికి కొట్టి వారి కారును దొంగిలించి పారిపోతాడు. ఆ తర్వాత ఏమైంది . అనేది సినిమా.
విశ్లేషణ:
తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి తన జర్నీని కొనసాగించాలని అనుకున్న సిద్ధార్థ్ యాక్షన్ హీరోగా కూడా చేయగలను అని చెప్పేందుకు చేసాడు. కార్ ఛేజింగ్ కూడా బాగా చేసాడు. గతంలో యాక్షన్ కథలు వచ్చాయి కానీ ఎందుకు ఫైట్ చేయాలో అర్థం లేకుండా కథలు రావడంతో చేయలేదని అన్న సిద్ధార్థ్ కు ఇది లాజిక్ కా ఉంది. ధీనితో పాటు టక్కర్ వేషాలు, దివ్యాంశ కౌశిక్ తో రొమాన్స్ డోస్ బాగా పెంచాడు. ఇందులో తనపై తానే టక్కరి అనేలా హీరోయిన్ తో డైలాగ్ కూడా ఉంది.
అయితే, ఈ సినిమాలో సిద్ధార్థ్ రోల్‌ను డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ డిజైన్ చేసిన తీరు కార్తీ ఆవారా వంటి సినిమాలను మిక్స్ చేసి తెరకెక్కించినట్లు స్పష్టమవుతుంది. అభిమన్యు సింగ్ విలనిజం కామెడీగా చూపించాడు. యోగిబాబు రెండు పాత్రలు చేసి నవ్వించే ప్రయత్నం చేసాడు. ఆర్.జె.విఘ్నేష్ రోల్ హీరో ఫ్రెండ్‌గా రొటీన్‌గానే కనిపిస్తుంది. మిగిలిన పాత్రలు మామూలుగానే ఉన్నాయి.
వాంజినాథన్ మురుగేశన్ సినిమాటోగ్రఫీ బావుంది. అయితే నివాస్ సంగీతం, నేపథ్య సంగీతం బాగోలేదు. సినిమా పరంగా నవ్వించే ప్రయత్నం చేసాడు. రొటీన్ కథలా ఉన్న మధ్యలో రొమాన్స్ తో ఇప్పటి తరం ఇలాఉంది అని చూపించే ప్రయత్నం చేసాడు. శంకర్ దగ్గర పనిచేసిన సిద్ధార్థ్, డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ ఎదో గొప్ప సినిమా తీశారనుకుంటే పొరపాటే. ట్రైలర్లో కథ చెప్పకుండా కేవలం రొమాన్స్ చూపించి కన్ ఫ్యూస్ చేసాడు. కానీ ఈ సినిమా లో కథ సీరియస్ గా ఉంటుంది. కానీ ఆ కోణంలో వెళ్లకుండా కేవలం రొటీన్ గా ఉన్నట్లు చూపించాడు. ఓ సారి చూడవచ్చు.