గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (10:49 IST)

'ఆదికేశవ' సినిమా ఎలా ఉందో తెలుసా! రివ్యూ

Adikesava
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
కథ;
బాల కోటయ్య (వైష్ణవ తేజ్) చిత్ర (శ్రీ లీల) దగ్గర కాస్మొటిక్ కంపెనీ లో పనిచేస్తాడు. తండ్రి అక్రమ వ్యాపారాలకు భిన్నంగా చిత్ర ఆ కంపెనీ పెడుతుంది. ఇక బలకోటయ్య ఓన్ సైడ్ లవ్ లో పడతాడు. ఇది తెలిసిన చిత్ర తండ్రి తన వ్యాపార పార్టనర్ కొడుక్కి చిత్ర ను పెళ్లి చేస్తానని చిత్ర బర్త్ డే నాడు చెపుతాడు. 
 
తనకు ఇష్టం లేదని బాల కోటయ్య ను ప్రేమించానని చెపుతుంది. ఇది సహించని ఆమె తండ్రి బాలు ను చంపటానికి ప్లాన్ చేస్తాడు. అదే టైంలో తనికెళ్ళ భరణి, రాధిక వచ్చి. మీ నాయన (సుమన్) చనిపోయాడు అని రాయలసీమకు తీసుకువెళతారు. ఇక అక్కడ విలన్ (జీజో) అరాచకాలను, తన తండ్రి చావుకు కారణమైన అతన్ని ఈ విధంగా మట్టు పెట్టాడు అన్నది సినిమా.
 
సమీక్ష..
ఈ కథ చాలా సినిమాలను గుర్తుచేస్తుంది. ఎక్కడా కథలో మమేకం అయ్యే విధంగా ఉండవు. కొత్త దర్శకుడు ఇంకాస్త క్లారిటీ గా తీయాల్సిందే. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కామన్. ఎమోషనల్ పండలేదు. డాన్స్, ఫైట్స్ పెద్ద హీరో రేంజి లో ఉన్నాయి. 
 
మూస ధోరణిలో సినిమా ఉంది. కెమెరా, సంగీతం పర్వాలేదు. అందరూ బాగా నటించారు. క్లైమాక్స్ లో బాల కోటయ్య ఎవరు అనేది ట్విస్ట్ ప్రేక్షకుడికి కలగలేదు. ఉప్పెన తీసిన హీరో కు తగ్గ సినిమాగా లేదు.
రేటింగ్.. 2/5