ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (13:16 IST)

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

Daku- balayya
Daku- balayya
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, సచిన్ ఖేడేకర్, హిమజ తదితరులు.
సాంకేతికత:  ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, దర్శకుడు : బాబీ, నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం : ఎస్. థమన
 
నందమూరి బాలక్రిష్ణ సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా “డాకు మహారాజ్”. ఛంబల్ లోయ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందిందని ముందునుంచి దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఫ్యాన్స్ కు పండుగలాంటి సినిమా. ప్రీరిలీజ్ లో సహారా వంటి హాలీవుడ్ సినిమాతో బాలక్రిష్ణ పోల్చారు. మరి ఈరోజే విడుదలైన సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
సచిన్ ఖేడేకర్ నార్త్ లో టీతోటలో నివసిస్తుంటాడు.   ఆ తోటలోనే పక్కన తోటను ఓ వ్యక్తి అద్దెకు తీసుకుని గంజా పెంచుతుంటాడు. అలా ఇద్దరిమధ్య వైరం ఏర్పడుతుంది. ఓ రౌడీ వచ్చి సచిన్ ను బెదిరిస్తాడు. అంతేకాక మనవరాలిని హత్యచేసేందుకు వెనుకాడని బెదిరిస్తాడు. ఈ విషయంతెలుసుకున్న ఆ ఇంటికి చెందిన ఓ వ్యక్తి డాకుమహారాజ్ కు ఫోన్ చేసి వైష్ణవి పాప ప్రాణాలకు ముప్పువుందని చెబుతాడు. జర్నీలో వున్న డాకు ఈ విషయం తెలిసి ఆఘమేఘాలమీద టీ తోటల దగ్గరకు వచ్చి వారికి ఎటాక్ చేస్తాడు. ఎవరీ డాకు మహారాజ్ అంటూ అక్కడివారు అడగడంతో కథ ఫ్లాష్ బ్యాక్ కు వెళుతుంది.
 
ఇంజనీయర్‌ సీతారాం (నందమూరి బాలకృష్ణ)గా  చంబల్ ప్రాంతం వస్తాడు. అక్కడవారి తాగునీటికి కటకటలాడుతుంటే అక్కడి సమస్యలు స్పష్టించేవారికి ఎదురుతిరుగుతాడు. అప్పటినుంచి సీతారాం డాకు మహారాజ్ గా పేరు పొందుతాడు. భలవంత్ సింగ్ ఠాగూర్ (బాబీ డియోల్) అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్ట పెడుతూ ఉంటారు. వారినీ ఏవిధంగా డాకు ఎదుర్కొన్నాడు. అసలు పాప కోసం ఇంత రిస్క్ చేయడానికి డాకుకు ఏమి సంబంధం. శ్రద్దా శ్రీనాథ్ పాత్ర ఏమిటి? డాకు ఫైనల్ గాఏమి సాధించాడు? అన్నది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
మొత్తంగా ఈ సినిమా కథంతా పరిశీలిస్తే ఓదశలో గతంలో బాలక్రిష్ణ చేసిన సినిమాలతోపాటు రాజమౌళి తీసిన సింహాద్రి ఛాయలు గుర్తుకు వస్తాయి. అయితే డాకు నేపథ్యం వేరుగా వుండడం ఒక్కటే తేడా. దర్శకుడు బాబీ కూడా బాలక్రిష్ణను తన శైలిలో మార్చాడు. బాలక్రిష్ణ కూడా తన హీరోయిజం, బిల్డప్ షాట్స్, యాక్షన్ తో అలరించాడు. దాంతో సినిమా ఫ్యాన్స్ కు పండుగలా అనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. 
 
 శ్రద్దా శ్రీనాధ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. బాలయ్యతో రెండో సినిమాగా చేసిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు వారి పరిధిమేరకు నటించాయి.
 
ఇక టెక్నికల్ గా థమన్ గేమ్ ఛేంజర్ కు సరిగ్గా ట్యూన్స్ ఇవ్వలేకపోయినా డాకు లో మాత్రం బాగా ఆకట్టుకునే ఇచ్చాడు.  దర్శకుడు బాబీ కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ బాలయ్యను కొత్తగా చూపిస్తూ, అన్ని అంశాలు మెచ్చేలా చేశాడు. కామెడీ కూడా సరిపడా సన్నివేశపరంగా ఇచ్చాడు. బాలక్రిష్ణ యాక్షన్ సన్నివేశాలతోపాటు అన్ని సరిపోయేలా చూసుకున్నాడు. ఎమోషన్ లను బాగా పండించాడు.
 
సెకండాఫ్ లో వచ్చే బాబీ డియోల్ పాత్ర తో డాకు చేసే యాక్షన్ హైలైట్ గా వుంటాయి. ఈ కథ,కథనం మొత్తం గతంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాలను కొన్నిచోట్ల పోలికలు కనిపిస్తాయి. చాలా చోట్ల మైనస్ లున్నా, సంక్రాంతికి సరైన సినిమా లేకపోవడంతో డాకు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. 
 
బాలయ్య, విలన్ల మధ్య యాక్షన్ శ్రుతిమించింది. నరకడాలు, హింసలు, రక్తపాతం కావాల్సినంత వుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్ బాగుంది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మాణ విలువలుబాగున్నాయి. గతంలో వచ్చిన సినిమాలను పోలివున్నా బాలయ్య మార్క్ తో ఫ్యాన్స్ ను అలరించేలా చేయడం విశేషం. టైటిల్ గా చూసుకుంటే డాకు మహారాజ్ అనేది కూడా కథకు సూట్ కాలేదు. హీరో ను ఓ మహారాజ్ లా వుండాలనే టైటిల్ పెట్టినట్లుంది.
రేటింగ్ : 3/ 5