మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (16:12 IST)

వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' అదిరిపోయిందిగా... రివ్యూ(Video)

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు దేశంలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్సార్. ఆయన చేసిన పాదయాత్ర ఇతివృత్తంగా యాత్ర చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు శుక్రవారం 8న ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్లలో విడుదలైంది. చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్రేక్షకులంతా వైఎస్సార్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అదరగొట్టాడని అంటున్నారు. వైఎస్సార్ పాత్రలో రాజన్న తిరిగి వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా వంటి డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో వైఎస్సార్ లా మమ్ముట్టి అదరగొట్టాడని అంటున్నారు.
 
ఇకపోతే ఈ చిత్రానికి మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ‌మ్ముట్టి వై.ఎస్ పాత్ర పోషించారు. ఈ చిత్రం గురించి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాదయాత్ర ఎంత సెన్సేష‌న్ అయ్యిందో.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంద‌రికీ తెలుసు. దాన్ని ఐడియాగా తీసుకుని పాద‌యాత్రలో ఉన్న ఎమోష‌న్స్, మూమెంట్స్‌ను తీసుకుని మ‌హి రెడీ చేసిన స్ర్కిప్ట్‌కి మా విజ‌య్ ప్రొడ్యూస్ చేయ‌డం.. లెజండ‌రీ యాక్ట‌ర్ మ‌మ్ముట్టి గారు న‌టించ‌డంతో.. టీజ‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు.. సాంగ్స్ రిలీజ్ అయిన‌ప్పుడు ఎగ్జైట్మెంట్ క‌నిపించింది. 
 
రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాద‌యాత్ర‌లో జ‌రిగిన మూమెంట్స్ ఆరోజుల్లో టీవీల్లో పేప‌ర్ల‌లో చ‌దివాం. త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు హీరో అయ్యారు. పాద‌యాత్ర త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి లైఫే మారిపోయింది. రామారావు గారి త‌ర్వాత మ‌ళ్లీ మ‌న రాష్ట్రాల్లో అంత ఇమేజ్ వ‌చ్చింది జ‌నాల్లో వై.ఎస్ గారికే. అలాంటి రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి ఇతివృత్తంతో వ‌స్తోన్న ఈ యాత్ర పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.