శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (18:13 IST)

మల్టీ జోనర్ ఫిల్మ్ నేను - కీర్తన ఎలా వుందంటే రివ్యూ

Nenu keerthana
Nenu keerthana
నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ; కె.రమణ, ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు, సంగీతం : ఎమ్.ఎల్.రాజా, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి,  రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) విడుదల తేది: 30-08-2024
 
సినిమాపై తపనతో తమను తాము నిరూపించుకునేందుకు సరికొత్తతరం ముందుకు వస్తోంది. అందులో చిమటా రమేష్ అన్నీ తానే అయి నేను కీర్తన నిర్మించారు.  స్వయంగా కథ - మాటలు - స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న చిమటా రమేష్ బాబు డైరెక్టర్ కమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలైంది. అందరూ చూడతగ్గ చిత్రంగా రిలీజ్ కుముందు చెప్పినది నిజమేనా అని తెలుసుకోవాలంటే సమీక్ష లోకి వెళ్సాల్సిందే. 
 
కథగా చెప్పాలంటే.. అన్యాయాన్ని సహించని యువకుడు జానీ. ఎవరైనా ఆపద అని వస్తే ఆదుకుంటాడు. అలాంటి జానీ  జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశిస్తుంది.  ఆమె రాకతో అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది, తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా... సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించాడన్నది క్లుప్తంగా కథ.
 
సమీక్ష:
అన్ని రకాల ఎమోషన్స్ ను పండిచేలా మల్టీ జోనర్ లో ఈ సినిమాను తీసుకెళ్ళాడు. అన్ని బాధ్యతలు తీసుకున్నా లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసి చూపించడం సాహసమే అని చెప్పాలి. అందులో కొంత సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుడు కావాల్సింది ఎవరికి నచ్చింది వారు ఎంచుకోవడమే లాజిక్ తో ఈ సినిమా తీసినట్లుంది.
 
నటనాపరంగా హీరో రమేష్ బాబు తన శైలిలో మెప్పించాడనే చెప్పాలి. దానితోపాటు యాక్షన్, డాన్స్ లోనూ రాణించాడు. దర్శకుడు రచయిత అయితే అన్ని కరెక్ట్ గా కుదురుతాయనేలా సహజమైన మాటలకు ప్రయత్నం చేశాడు. మిగిలిన వారు విజయ రంగరాజు, జీవాలు చాలా కాలం తర్వాత వెండితెరపై తమ స్థాయి చూపించారు.  జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా అసహజత్వానికి, తావు లేకుండా చక్కగా నటించారు. 
 
అయితే ఎక్కువ బాధ్యతలు నిర్విహిస్తే ఎక్కడో చోట కొంచెం తగ్గక మానదు అన్నట్లు దర్శకత్వం, హీరో బాగా చేసినా రచయితగా కొన్ని సార్లు తప్పటడుగులు వేశారు. దానిపై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఎందుకంటే కొన్ని మాటలు సన్నివేశపరంగా భారమయ్యాయి. ఒక్కోసారి ఇన్ని జోనర్లు చేయడం అవసరమా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా  ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది.   కెమెరా పనితనం, ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం పర్వాలేదు. ఎక్కువ భాగం యాక్షన్ వైపు దర్శకుడు వెళ్ళాడు. సరికొత్తగా చేయాలనుకున్న చిత్రాన్ని తీసి రిలీజ్ చేయడం ఇప్పటి తరుణంలో సక్సెస్ కింద లేక్కే. అగ్ర హీరోస్ సినెమాలకే జనాలు రాని నేటి తరుణంలో చిన్న సినిమా ను తీసి విడుదల చేయడం గొప్ప విషయం. కాకపోతే  చిన్నపాటి లోపాలున్నాయి. వాటిని అధిగమించి తదుపరి సినిమాలోనైనా జాగ్రత్తలు తీసుకుంటే  నేను - కీర్తన చిత్రం మంచి బిగినింగ్ అవుతుంది. 
 రేటింగ్ : 2.5/5