గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (07:04 IST)

బోస్ : డెడ్ ఆర్ అలైవ్ (Official Trailer)

భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశం గర్వించదగ్గ వీరుడు. బోస్ జీవిత నేప‌థ్యంలో 'బోస్: డెడ్ ఆర్ అలైవ్' టైటిల్‌తో తాజాగా ఓ వెబ్‌సిరీస్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే.

భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశం గర్వించదగ్గ వీరుడు. బోస్ జీవిత నేప‌థ్యంలో 'బోస్: డెడ్ ఆర్ అలైవ్' టైటిల్‌తో తాజాగా ఓ వెబ్‌సిరీస్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. 
 
పుల్కిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కి ఏక్తా క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాకు రక్తాన్ని ఇస్తే మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తా అన్న బోస్ ఆ త‌ర్వాత నేతాజీగా ఎలా మారాడు, ఆయ‌న మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటీ త‌దిత‌ర వివ‌రాలు ఈ వెబ్ సిరీస్‌లో వివ‌రించనున్నారు. 
 
రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన టీం ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ సిరీస్‌పై భారీ అంచ‌నాలు పెంచింది. త్వ‌ర‌లో ఈ సిరీస్ ఏఎల్‌టీ బాలాజీ అనే వెబ్ ఛానల్‌లో ప్ర‌సారం కానుంది.