గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:26 IST)

ప్రతి ఇంటికి 'జ‌వాన్'లాంటోడు ఒక్కడుండాలి.. టీజ‌ర్ అదుర్స్ (Teaser)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటిస్తున్న చిత్రం "జవాన్". బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రం తెరకె

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటిస్తున్న చిత్రం "జవాన్". బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రం తెరకెక్కింది. సోష‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుద‌ల కానుంది. 
 
విడుదల తేదీ సమీపిస్తుండటంతో మూవీపై భారీ హైప్స్ క్రియేట్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలో సోమవారం ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్‌లోని హీరోలాంటి వాడు ఉండాలంటున్నాడు దర్శకుడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన సాయి ధరమ్‌కు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని చెప్పారు.