శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (15:57 IST)

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

Seetha Kalyana Vaibhogame pre relese
Seetha Kalyana Vaibhogame pre relese
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది.  ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నటుడు రమణారెడ్డి, నీరూస్ ప్రతినిధి హసీం వంటి వారు అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..
 
ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,  ఈ మూవీ టైటిల్ చూస్తే ఎంతో ఫీల్ గుడ్‌లా కనిపిస్తోంది. మంచి చిత్రంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. హీరో హీరోయిన్లకు మంచి పేరు రావాలి. మా మిత్రుడు నిర్మాత యుగంధర్‌కు ఈ చిత్రం మంచి పెద్ద విజయం సాధించి మంచి లాభాలు తీసుకురావాలి  అని అన్నారు.
 
సుమన్ తేజ్ మాట్లాడుతూ, సతీష్ గారికి థాంక్స్. మా ఇద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం. కొన్ని వందల స్క్రిప్ట్‌లను విన్నాం. ఈ సినిమాతో మా సినీ జర్నీ స్టార్ట్ అయింది. తెలుగు రాకపోయినా గరిమ చౌహాన్ చక్కగా నటించింది. భారీ డైలాగ్స్‌ను కూడా చెప్పింది. పూర్ణాచారి మంచి పాటలు ఇచ్చారు. చరణ్ అర్జున్  మంచి సంగీతాన్ని అందించారు. నీరూస్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ రోజు ఇక్కడి వరకు సినిమా వచ్చింది. శివాజీ రాజా, నాగినీడు వంటి సీనియర్లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నాకు గగన్ లాంటి మంచి మిత్రుడు దొరికాడు. ఏప్రిల్ 26న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
 *గగన్ విహారి మాట్లాడుతూ..* ‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత కారెక్టర్‌లో గరిమ చక్కగా నటించారు. కొన్ని సీన్లు చూస్తే నాకే బాధగా, భయంగా అనిపించింది. ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన సతీష్ గారికి థాంక్స్. సుమన్ తేజ్‌కు ఫస్ట్ సినిమా అయినా అద్భుతంగా నటించారు. యుగంధర్ లాంటి నిర్మాతను నేను ఎక్కడా చూడలేదు. చాలా రిచ్‌గా నిర్మించారు. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మా సినిమాను ప్రతీ ఒక్కరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
 *గరిమ చౌహాన్ మాట్లాడుతూ..* ‘సీతలాంటి పాత్ర నా కెరీర్‌ ప్రారంభంలోనే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా నా డ్రీమ్ నిజం కాబోతోంది. ఈ మూవీతో నా ప్రయాణం మొదలైంది. నాకు ఇక్కడ ప్రేమ, ప్రోత్సాహం లభిస్తోంది. మా లాంటి కొత్త వాళ్లకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం. నా మీద ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఏప్రిల్ 26న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.