గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జులై 2022 (12:41 IST)

Alluri Sitaramaraju: సర్.. సర్.. సెల్ఫీ ప్లీజ్: ప్రధాని మోదీతో మంత్రి రోజా సెల్ఫీ

Roja Selfie with Modi
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, ఆజాదీకా అమృత్ ఉత్సవ్‌లో భాగంగా భీమవరంలో ప్రధానమంత్రి మోదీ వీరుడి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో బహిరంగ సభను నిర్వహించారు.

 
సభలో ప్రధాని మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శిరసు వంచి వందనం చేస్తున్నామన్నారు. గిరిజనుల కోసం 750 గిరజన పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిని చూస్తుంటే మన దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడపడంలో ఎవ్వరూ అడ్డుకోలేరని విశ్వాసం కలుగుతుందన్నారు.

 
సభ ముగిశాక ప్రధానమంత్రి అందరికీ అభివాదం చేస్తూ వెళ్తుండగా మంత్రి రోజా సెల్ఫీ కోసం ప్రధానిని అడిగారు. ఆయన నవ్వుతూ సెల్ఫీకి ఫోజు ఇచ్చారు.