ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 మార్చి 2021 (15:53 IST)

ఏయ్... ఆ వీడియో డిలిట్ చెయ్, అభిమాని చెంప పగలగొట్టిన బాలయ్య

నట సింహానికి మళ్లీ కోపమొచ్చింది. దాంతో మరోసారి పంజా విసిరింది. దీనితో నట సింహం అభిమాని చెంప పగిలిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
 
బాలయ్య. పొలిటికల్ పర్యటనలు, రోడ్ షోలంటే ఆయన అభిమానులకు ఖుషీగా వుంటుంది. ఎంత ఖుషీగా వుంటుందో అంతేస్థాయిలో చెంపలు పగిలిపోతుంటాయి. అంటే... పర్యటనల సమయంలో బాలయ్యకు కోపం వస్తే అభిమానుల చెంపలపై చూపిస్తుంటారు. తాజాగా హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు.
 
అక్కడ అనుసరించాల్సిన వ్యూహం గురించి అభ్యర్థినితో మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని వెనుక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఎంతైనా సింహం కదా... వెనుక నుంచి ఏదో జరుగుతుందని తల తిప్పి చూసిన బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. ఏయ్... ఆ వీడియో డిలిట్ చెయ్ అంటూ చెంప ఛెళ్లుమనిపించారు. దాంతో అభిమాని షాక్ తిన్నాడు.
 
బాలయ్య ఆగ్రహం చూసి అతడికి తడిసిపోయిందని అక్కడివారు చెపుతున్నారు. మొత్తమ్మీద వీడియో డిలిట్ చేసిన తర్వాత నట సింహం తిరిగి మామూలయ్యారు. ఇప్పుడీ ఘటన ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా మారిపోయింది. హిందూపురంలో అదే ఆయుధంగా చేసుకుంటూ మాట్లాడుతున్నారు.