Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రోజాతో మాట్లాడిన బాలయ్య, ఇంతకీ ఏ విషయం గురించి...?

Written By శ్రీ
Updated: మంగళవారం, 2 జూన్ 2020 (09:45 IST)
బాలయ్య రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. హిందూపూర్ చాలా డెవలప్ చేశాను అందుకే నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండదు, ప్రజలు తిరగబడతారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు, నేను చెప్పింది జరుగుతది అంటూ వైసీపీ గవర్నమెంట్ పైన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
ఆనాడు చంద్రబాబు తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేశారు. ఆ ఫలాలు ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అన్నారు. ఏ పార్టీ అధికారంలో వున్నా డెవలప్మెంట్ ముఖ్యం. హిందూపూర్‌లో ఇండస్ట్రీ కారిడార్ కోసం రోజాతో మాట్లాడాను. తప్పకుండా చేద్దాం బాబు అని చెప్పింది అన్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.... జూనీయర్ ఎన్టీఆర్‌కు సినీ యాక్టర్‌గా బోలెడు భవిష్యత్ వుంది. ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడనేది అతడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. బ్రాహ్మణి రాజకీయాలలోకి వస్తుందనుకుంటున్నారు కానీ.. ఆమె రాజకీయాల్లోకి రాదన్నారు.
 
మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ... గతంలో ఒకరిద్దరితో కలసి చేయాలనుకున్నాను కానీ... వాళ్ల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే వాళ్లతో సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాను. ప్రస్తుతం నా ధ్యసంతా బోయపాటి సినిమా మీదనే అన్నారు.

అన్నీ చూడండి

Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ పై సాంగ్

Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్

Vijay Deverakonda: రశ్మిక రానందుకు సారీ - నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు వారి జీవితాలు మార్చుకోండి : విజయ్ దేవరకొండ

త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ పోస్టులు.. కాపీ క్యాట్ డైరక్టర్.. ఏకే, అజ్ఞాతవాసి, హనీ ట్రాప్ అంటూ..?

Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments