ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (16:23 IST)

ఐపీఎస్ అధికారి డర్టీ పిక్చర్ : టెక్కీ భార్యతో రాసలీలలు...

వివాహేతర సంబంధాలను అరికట్టేందుకు పోలీసులే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఈ తరహా సంబంధాలు పెట్టుకునేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే, కర్ణాటక రాజధాని బెంగుళూరులో విధులు నిర్వహించే ఓ ఐపీఎ

వివాహేతర సంబంధాలను అరికట్టేందుకు పోలీసులే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఈ తరహా సంబంధాలు పెట్టుకునేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే, కర్ణాటక రాజధాని బెంగుళూరులో విధులు నిర్వహించే ఓ ఐపీఎస్ అధికారి ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ గుట్టును ఆ మహిళ భర్త బహిర్గతం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ఓసారిపరిశీలిద్ధాం. 
 
బెంగుళూరు, దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(40)కు ఓ యువతితో 2010లో వివాహమైంది. రెండేళ్లపాటు అమెరికాలో ఉండి.. తిరిగి ఆ జంట నగరానికి వచ్చేసింది. భర్త టెక్కీగా పని చేస్తుంటే, భార్య మాత్రం గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గతేడాది ఆమె స్టూడియోకి ఎస్పీ భీమశంకర్‌ గులేద్‌ ఓ ఫోటో షూట్ నిమిత్తం వచ్చారు. ఆమెతో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ సిటీలో సినిమాలకు షికార్లకు వెళ్లసాగారు. ఈ విషయం టెక్కీ భర్తకు తెలిసి, భార్యను మందలించాడు. 
 
భర్తకు భయపడి కొన్నాళ్లు ఐపీఎస్ ఆఫీసర్‌ను కలవడం మానేసిన ఆమె, తర్వాత మళ్లీ కలవడం మొదలెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త... తన భార్య, ఐపీఎస్ ఆఫీసర్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ వీడియో తీశాడు. అంతేకాకుండా భార్య ఫోనులో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలను.. మొత్తం సాక్ష్యాలను సేకరించి మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేసినట్టు చెప్పాడు. ఈ వ్యవహారంలో టెక్కీ భార్య వివరణ మాత్రం మరోలా ఉంది. భర్తతో తనతో గొడవ పడి, వేరుగా ఉంటున్నాడని, ఆ కారణంగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపిస్తోంది. 
 
ఇక భీమశంకర్‌ భార్య కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది. భీమశంకర్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె సైతం పోలీసులను ఆశ్రయించటం కొసమెరుపు. అయితే భీమశంకర్‌ మాత్రం తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను ప్రలోభపెట్టి కేసు పెట్టించారంటూ చెబుతున్నాడు. ఈ వరుస ట్విస్ట్‌ల మూలంగా కేసు కోసం రాష్ట్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. హోంమంత్రి పరమేశ్వర ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.