Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బిగ్ బాస్ 3: కంటెస్టెంట్ హిమజపై యమ క్రేజ్ గురూ... పట్టేస్తుందా?

Updated: సోమవారం, 22 జులై 2019 (18:59 IST)
బిగ్ బాస్ 3 తెలుగు ఆదివారం నాడు అక్కినేని నాగార్జున హోస్టుగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తన స్టామినా ఏమిటో బాస్ హౌసులో అడుగుపెట్టి నిరూపించుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన సభ్యుల్లో హిమజ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
 
హిమజ ఎక్కడి నుంచి వచ్చింది... ఏం చదివింది.. ఇండస్ట్రీలోకి ఎలా పరిచయమైంది అనే వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. హిమజ ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తోంది. ఆమె దాదాపుగా ఆరడుగుల ఎత్తు వుంటుంది. 29 ఏళ్ల హిమజ విశాఖపట్టణంలో చదివింది. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో రూ. 5000 ఉద్యోగం చేసింది. 
 
ఐతే ఆమె దృష్టంతా నటనపై పడటంతో తొలుత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమె భార్యామణి అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. ఇక అలాఅలా ఆమె పలు టీవీ సీరియళ్లలో నటిస్తూనే యాంకర్‌గా కూడా చేసింది. కొంచె ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ క్రమంలో ఆమెకి సినిమా అవకాశాలు వచ్చాయి.
 
శివం చిత్రంలో పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇటీవలే విడుదలైన వినయవిధేయ చిత్రంలో చెర్రీకి వొదిన పాత్రలో నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ 3 షోలో సభ్యురాలిగా ఎంపికై అందరి దృష్టిలో పడింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా వుంటుంది. హిమజ బిగ్ బాస్ 3లో ఏమేరకు తోటి సభ్యులపై నెగ్గుతుందో చూద్దాం.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments