మంగళవారం, 1 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 జూన్ 2025 (22:03 IST)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

Priest kisses woman neck
భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల మూఢ విశ్వాసాలు ప్రచారంలో వున్నాయి. అమాయకుల నమ్మకాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు రకరకాల అవతారాల్లో మాయ చేసి వంచిస్తున్న ఘటనలు ఎన్నో బైటకు వస్తూనే వున్నాయి. తాజాగా తమిళనాడుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇలా వున్నాయి.
 
ఎవరైనా సమస్యలు, ఇక్కట్లు, దోషాలతో సతమతమవుతుంటే వాటిని తరిమేందుకు పూజారులు వున్నారట. సమస్యలతో బాధపడేవారిని వారి వద్దకు తీసుకుని వెళితే... బాధితులను వారు గట్టిగా వాటేసుకుంటారు. మెడ మీద ముద్దు పెట్టుకుంటారు. బాధితులు ఎవరైనా సరే పూజారుల కౌగిలిలో నలిగిపోవాల్సిందే. అలా కొద్దిసేపు కౌగిలిలో గట్టిగా బంధించి అనంతరం కిందకి వదిలేస్తారు. అంతే... వారికి పట్టిన దుష్ట శక్తులు, సమస్యలు ఇతర బాధలన్నీ వదిలేసి పరారవుతాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.