బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (17:17 IST)

ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్‌తో మమత బెనర్జీ.. నెట్టింట వైరల్

గాలేలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా డ్రెస్ గురించి పెద్ద రచ్చే జరిగింది. గాలేలో ప్రియాంక చోప్రా గోస్ట్‌‍లా డ్రస్సేసుకుని రావడం.. ఆ డ్రెస్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు పేలడం జరిగిపోయాయి.


కానీ ప్రియాంక చోప్రా డ్రెస్‌, హెయిర్ స్టైల్‌ను పోల్చుతూ మీమ్స్ పేలాయి. ప్రస్తుతం ఈ మీమ్స్ సినీ సెలబ్రిటీలతోనే కాకుండా రాజకీయ నాయకులకు కూడా పాకింది. 
 
తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని ప్రియాంక చోప్రా హెయిర్ స్టయిల్‌తో పోల్చుతూ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మమత ఫోటోను ప్రియాంక చోప్రా ఫోటోలా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ మార్ఫింగ్ చేసి నెట్టింట్లో పోస్టు చేశారని తెలిసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంక శర్మను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.