శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (16:30 IST)

భార్య గురించి పట్టించుకోని వ్యక్తి.. గుంజీలు తీయాలి.. మోదీకి దీదీ సవాల్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారం పేరుతో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ప్రధానికి ప్రజాస్వామ్యం చెంపదెబ్బేంటో రుచి చూపిస్తామని దీదీ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై  ప్రధాని స్పందించారు. మమతా బెనర్జీని తాను సోదరిలా భావిస్తానని చెప్పుకొచ్చారు. దీదీ కొట్టే చెంపదెబ్బ తనకు దీవెనగా మారుతుందని మోదీ కామెంట్స్ చేశారు. తనను చెంపదెబ్బ కొట్టిన ఫర్వాలేదని, అంతకంటే ముందు పేదలను మోసం చేసిన చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. 
 
ఇక, మోదీ టార్గెట్‌గా దీదీ మరోసారి చెలరేగిపోయారు. బొగ్గు మాఫియాలో టీఎంసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే రుజువు చేయాలని మోదీకి సవాల్ విసిరారు. రుజువు చేయలేక పోతే, చెవి పట్టుకొని వంద గుంజీలు తీయాలని సవాల్ చేశారు. భార్య గురించి పట్టించుకోని వ్యక్తికి ప్రజల సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.