సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (15:31 IST)

మోడీ ఓబీసీ అయితే ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా? మాయావతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన కులం వ్యక్తికాదన్నారు. ఆయన ఓబీసీ అయితే దేశ ప్రధానిగా ఆర్ఎస్ఎస్ అంగీకరించేదా అని ఆమె ప్రశ్నించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓబీసీ కాదన్నారు. ఆయన వెనుకబడిన కులం నేత అయితే ఆర్ఎస్ఎస్ ఆయనను ప్రధానిగా అంగీకరించేదే కాదన్నారు. అణగారిన వర్గాల ప్రజలు బాధలు, సమస్యలు మోడీకి తెలియవన్నారు. 
 
గుజరాత్ రాష్టరంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పెళ్లి చేసుకుంటే, వారు గుర్రపు బగ్గీలపై ఊరేగకుండ అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఎస్పీ - ఎస్పీ పొత్తును కులాల కూటమిగా మోడీ అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 
 
ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో పాటు.. మోడీకి షాక్ తప్పదన్నారు. మోడీని మళ్లీ ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని మాయావతి జోస్యం చెప్పారు.