మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 మే 2024 (12:21 IST)

బైక్ పైన పారిపోతున్న చైన్ స్నాచర్స్‌ను బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్ - video

chain snatchers
ఈమధ్య కాలంలో మెడలో వేసుకున్న బంగారం గొలుసులను తెంపుకుని బైకులపై పారిపోయే దొంగలు ఎక్కువయ్యారు. ఇదివరకూ రాత్రివేళల్లో జరిగే ఈ దొంగతనాలు ఇప్పుడు పట్టపగలే జరుగుతున్నాయి. వంటరిగా రోడ్డుపై వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆటోలు, ప్రజా రవాణా వాహనాల్లో వెళ్లే వ్యక్తుల నుంచి చైన్ స్నాచింగ్ చేస్తున్నారు.
 
తాజాగా హర్యానా-కర్నాల్‌లో చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు దొంగలు బైక్ పైన పారిపోతున్నారు. ఎదురుగా బస్సు నడుపుతూ వస్తున్న బస్సు డ్రైవర్ అది గమనించి వారి బైక్‌ను బస్సుతో ఢీకొట్టాడు. దాంతో బైకుపై వెళ్తున్న దొంగలు కిందపడిపోయారు. అక్కడి నుంచి ఇద్దరూ పరుగెత్తుకుంటూ పారిపోతుండగా స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.