సీఎం జగన్‌తో చిరు భేటీ వాయిదా, చెవిరెడ్డి పోస్టింగ్ కలకలం
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఇటీవల రిలీజై సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ సినిమాకి ఏపీలో స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెప్పేందుకు చిరంజీవి, చరణ్ కలవనున్నారు. ఈ రోజు జగన్‌తో చిరు భేటి అంటూ వార్తలు వచ్చాయి.
అయితే... ఏమైందో ఏమో కానీ వాయిదా పడింది అంటూ ఈ రోజు కొత్త వార్త బయటకు వచ్చింది.
అసలు ఎందుకు ఇలా జరిగింది కారణం ఏంటని తెలుసుకుంటే... కొత్త విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే... సీఎం కార్యాలయం అసలు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదట.
నిన్నచిరు పీఆర్ టీమ్‌లో ఒకరి అత్యుత్సాహం వలన అలా ప్రచారం జరిగిందని తెలిసింది. అసలు నిజం ఏంటంటే... ఈ నెల 14న చిరు, చరణ్ జగన్‌ని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారట. ఇదిలావుంటే నిన్న రాత్రి చెవిరెడ్డి టీం అంటూ ఓ కామెంట్ బయటకు వచ్చింది. ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలు అవుతాయి అని మొదలెట్టి గతంలో జగన్ జైలులో వున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుందని చెర్రీ అన్నట్లు ఆ పోస్టులో పెట్టారు.
పైగా అప్పుడు వైఎస్ కుటుంబం పైన అంత కసితో వున్న మెగా కుటుంబం ఇప్పుడు సీఎం జగన్‌ను కలిసేందుకు పడిగాపులు పడుతున్నదంటూ పేర్కొన్నారు. మరి ఇది నిజంగా వైసీపీ నాయకులు చేసిందా లేదంటే ఆ ఖాతాతో వేరేవాళ్లు చేసిందా తెలియాల్సి వుంది.