శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 17 మే 2021 (17:48 IST)

ఐదు రోజుల్లోనే కరోనా నెగటివ్, ఆ మందు కోసం పరుగులు పెడుతున్న జనం, ఎక్కడ?

ప్రస్తుతం కరోనా వచ్చినవారు అది తగ్గడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. మరికొందరైతే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అదంతా చేస్తున్నారు. ఇంగ్లీషు మందులతో పెద్దగా ఉపయోగం ఉండడం లేదని.. మైల్డ్‌గా కరోనా సోకిన వారు మాత్రమే బతికి బట్టకడుతున్నారని.. మిగిలిన వారు మృత్యువాత పడుతున్నారని జనంలోకి వెళ్ళిపోయింది.
 
దీంతో జనం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం క్రిష్ణపట్నంలో ఆనంద్ అనే ఒక వ్యక్తి పది రకాల వనమూలికలతో తయారుచేసిన ఆయుర్వేద మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మందులను తీసుకున్న జనానికి కరోనా తగ్గుతోందట.
 
ఐదు రోజుల్లోనే కరోనా వచ్చినవారు కోలుకుంటున్నారట. దీంతో నెల్లూరు జిల్లానే కాకుండా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఈ విషయం తెలిసింది. నిన్నటి నుంచి జనం ఆ దాత ఇంటి ముందు క్యూలైన్లలో నిలబడ్డారు. కరోనా రాకుండా ఉండాలంటే పది రకాల వనమూలికలతో తయారుచేసిన లేహ్యాన్ని ఇస్తున్నారట.
 
ఇక కరోనా వస్తే తిప్పతీగ వైద్యం అంటూ కొన్ని మందులను ఇస్తున్నారట. ఇలా ఆనంద్ అనే వ్యక్తి ఉచితంగానే ఈ మందులను పంపిణీ చేస్తున్నారట. దీన్ని వాడిన వారు బాగా పనిచేస్తోందని కూడా చెబుతున్నారు. దీంతో జనం క్యూ కట్టారు. సామాజిక దూరాన్ని గాలికి వదిలేశారు.
 
కరోనా వస్తే తిప్పతీగ వైద్యం చేయడంతో ఐదురోజుల్లోనే నెగిటివ్ వచ్చేస్తోందట. ఇంగ్లీషు మందులను నమ్ముకోవడం మానుకున్న జనం ఆయుర్వేద మందులపై పడ్డారు. అయితే దీన్ని ఇంతవరకు ఆయుర్వేద నిపుణులు దృవీకరించలేదు. జనం నమ్మకంతోనే వీటిని వాడేస్తున్నారట. ఐదురోజుల తరువాత నెగిటివ్ వస్తుందని చెపుతున్నారు. మరి ఈ మందు నిజంగానే కరోనాపై దాడి చేసి చంపేస్తుందా లేదో?