గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (17:54 IST)

మందు బాబులకు సునీత సూచనలు.. అలా బార్ల ముందు వాలిపోకండి..!

ప్రముఖ తెలుగు సింగర్ సునీత బుల్లితెరలో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోలో జడ్జిగా చేస్తుంది. ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా లైవ్‌లో పాల్గొంటుంది సునీత.
 
ప్రస్తుతం కోవిడ్ కారణంగా.. సినీ ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ఇక బుల్లితెర ప్రోగ్రాం నడుస్తూనే ఉండగా.. అందులో తాజాగా లాక్ డౌన్ ఇవ్వడంతో.. కాస్త సమయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.
 
నిన్నటి నుండి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా.. కేవలం నిత్యవసర సేవలకు, అవసరాలకు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజలంతా తమకు కావలసిన సరుకు సామానులు తెచ్చుకోగా.. మందు బాబులు మాత్రం వైన్స్, బార్ల ముందు తెగ వాలిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా సునీత లైవ్‌లో పాల్గొంటూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి తెలుపుతూ.. అభిమానుల కోరిక మేరకు లైవ్ లోని పాటలు పాడి వినిపిస్తుంది.
 
ఈ సందర్భంగా ఎవరినీ ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని కోరింది. బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ ముప్పు నుండి బయటపడవచ్చని తెలిపింది. తమకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలని తెలుపుతూ.. లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత మందుబాబుల తీరు చూసి ఆశ్చర్యపడింది. 
 
ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కేవలం మద్యం కోసం తెగ లైన్లు కడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మందుబాబుల తీరులను చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.