భర్తకు విడాకులు, మామతో రొమాన్స్- పెళ్లి
విడాకులు. ఇదివరకు పెళ్లయ్యాక విడిపోవడమంటే అంత త్వరగా జరిగేది కాదు. కానీ ఇప్పుడు అటు మగవారు కానీ ఇటు మహిళలు కానీ చిన్నచిన్న విషయాలకే దూరం అవుతున్నారు. ఏమాత్రం తేడా అనిపించినా కోర్టు మెట్లెక్కేసి విడాకులు తీసేసుసుకుంటున్నారు. ఆ తర్వాత తమ జీవితంలో ఎవరైనా నచ్చిన వ్యక్తి తారసపడితే మళ్లీ పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇది మామూలుగా మారిపోయింది. ఐతే అమెరికాలో విడాకులు తీసుకున్న మహిళ తన భర్త సవతి తండ్రిని పెళ్లి చేసుకోవడం వార్తల్లోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కెంటుకీలో వుండే 31 ఏళ్ల ఎరికా అనే మహిళకు, జస్టిన్‌కు పెళ్లయ్యింది. ఓ బాబు కూడా పుట్టాడు. ఐతే సజావుగా సాగుతున్న కాపురంలో గొడవలు వచ్చాయి. దీనితో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలా జరిగిన కొన్ని రోజులకే ఎరికా తన మాజీ భర్త సవతి తండ్రి జెఫ్ తో ప్రేమలో పడింది. అతడితో పార్కులు, షికార్లు చేయడమే కాదు 60 ఏళ్ల ఆ వృద్ధుడిని ఏకంగా వివాహం చేసేసుకుంది. అలా ఒకప్పుడు మాజీ భార్య కాస్త పిన్నిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ ముగ్గురూ ఒకే ఇంట్లో నివాసం వుంటున్నారు.