మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (13:13 IST)

కేసీఆర్ సమక్షంలో కారెక్కిన దానం నాగేందర్ ... ఎంపీగా పోటీ?

గ్రేటర్ హైదరాబాద్‌లో తనకంటూ ఓ గుర్తింపుకలిగిన రాజకీయ నేతల్లో దానం నాగేందర్ ఒకరు. ఫక్తు కాంగ్రెస్ వాది. కానీ ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఈయన... రాష్ట్ర

గ్రేటర్ హైదరాబాద్‌లో తనకంటూ ఓ గుర్తింపుకలిగిన రాజకీయ నేతల్లో దానం నాగేందర్ ఒకరు. ఫక్తు కాంగ్రెస్ వాది. కానీ ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఈయన... రాష్ట్ర విభజన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ముఖ్యంగా కారు స్పీడ్‌కు అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కనిపించకుండా పోయారు. వీరిలో దానం నాగేందర్ కూడా ఉన్నారు.
 
ఈయన తాజాగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కారు. తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బలమైన నేతగా పేరొందిన నాగేందర్‌ కాంగ్రెస్‌లో ఉండగా అనేక పదవులు చేపట్టారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా చేపట్టారు. 
 
అయితే ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎలాంటి స్థానం కల్పించబోతోంది అనేది చర్చనీయాం శంగా మారింది. దానం లాంటి వారు ప్రజలకు నాయకత్వం వహించాలి అని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఆయనకు ప్రాముఖ్యం ఉన్న పదవి దక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది. కాగా... ఎన్నికల్లో నాగేందర్‌కు ఏ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అనేకంగా ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ సీటు లేదా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.