గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (18:17 IST)

21 ఏళ్ళుగా అన్నం తిన‌లేదు, ఈ దిగంబర అఘోరా స్వామీజీ

ఈ దిగంబ‌ర అఘోరా స్వామీజీ 21 ఏళ్ళుగా అన్నం తిన‌డం లేదు...కేవ‌లం పండ్లు, పాలు త‌ప్ప ఏదీ తీసుకోలేదు. అలాంటి స్వామీజీ కృష్ణా జిల్లా నందిగామ‌కు చేర‌డంతో అంద‌రూ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
 
ఒరిస్సా లోని పూరీ జగన్నాథ్ స్వామి రధయాత్రలో పాల్గొని ఈ అఘోరా నందిగామకు వ‌చ్చారు. హైదరాబాద్ మహారాష్ట్ర మీదుగా, ఉత్తరాఖండ్ లోని కణ్‌కల్ హరిద్వార్ ద‌ర్శించి ఆయ‌న ఇక్క‌డ‌కు చేరారు. మాయాదేవీ మఠానికి చెందిన బఛ్ఛాగిరి మహరాజ్ దిగంబర అఘోరా స్వామీజీగా ఆయ‌న్ని పిలుస్తారు. ఆ స్వామికి నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా నందిగామ పాత బస్టాండ్ వద్ద గల ఒక ప్రైవేటు భవనంలో కొద్దిసేపు భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు వివరించారు. అఘోరా స్వామి గత 21 సంవత్సరాలుగా ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదని, కేవలం పండ్లు, పాలు మాత్రమే భుజిస్తారని వారి శిష్యులు దేవానంద్ గిరి మహరాజ్, ధర్నగిరి మహరాజ్, గోవింద గిరి మహరాజ్‌లు తెలిపారు.

ఆర్య వైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు, 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మారం అమరయ్య, ప్రముఖ ఆధ్యాత్మిక భక్తురాలు అనుమోలు దేవీ, పరిశె మల్లిఖార్జున రావు, నల్లమల్లి మురళి, పమిడిమర్రి ఆంజనేయులు తదితరులు అఘోరా స్వామిని సత్కరించారు.