గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (12:55 IST)

100 రోజులు నిద్రపోతే చాలు రూ. 10 లక్షలు, ఎక్కడ?

నిద్రపోయేవారిని సోంబేరులంటూ తిడుతుంటారు మన పెద్దలు. ఐతే ఇలా సోంబేరుల్లా నిద్రపోయేవారికి లక్షల్లో ఆదాయం వస్తుందంటే నమ్ముతారా? ఇది నిజం. బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మ్యాట్రెస్ తయారుచేస్తుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి పరుపులు తయారు చేయాలన్న విషయంలో స్లీప్ ప్యాట్రన్స్‌పై అధ్యయనం చేసేందుకు గాను ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ ప్రారంభించింది.
 
 ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైనవారు తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలన్నది నిబంధన. ఇలా 100 రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోవాలి. ఈ పోటీలో ఎంపికైన వారికి లక్ష రూపాయలిస్తారు. విజేతలైన వారికి రూ. 10 లక్షలు ఇస్తారు. ఐతే ఇందుకుగాను కంపెనీ పలు సూచనలు, సలహాలు ఇస్తుంది. వాటిని పాటించాలి. ఇంతకీ ఎక్కడ నిద్రపోవాలి అనుకుంటున్నారా... మీ ఇంట్లో నిద్రపోతే చాలు. ఆసక్తి గల అభ్యర్థులు wakefit.co/sleepintern సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది.