హలో మేడమ్.. కాలికి దెబ్బ తగిలింది.. కాస్త మందులేస్తారా? ఫార్మసీలోకి శునకం (Video)
విశ్వాసానికి మారుపేరు శునకం. ఆ శునకం మనుషుల భాషల్ని అర్థం చేసుకోగలదు. వారిని అనుసరించగలదు. ఇలా ఓ శునకం తనకు దెబ్బ తగలడంతో నేరుగా మందుల షాపులోకి వెళ్లింది. అంతటితో ఆగకుండా ఫార్మసీలోని మహిళా ఉద్యోగి వద్ద తనకు మందులేస్తారా అన్నట్లు నిల్చుంది. అలా తన ఫార్మసీకి వచ్చిన శునకానికి దెబ్బ తగిలిన చోట మందులేసిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో చెంగిస్ అనే మహిళ.. ఫార్మసీని నడుపుతోంది. మూగజీవులంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ మేరకు తన షాపులో వీధి శునకాల కోసం పడకలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఓ శునకం ఆయన షాపులోకి వచ్చింది.
అయితే శునకం ఫార్మసీలో నిద్రించేందుకు రాలేదు. చెంగిస్‌ను అదేపనిగా చూస్తుండిపోయింది. వెంటనే ఆ శునకంతో చెంగిస్ మాట్లాడటం ప్రారంభించింది. అప్పుడే ఆ శునకం కాలికి దెబ్బతగిలివుండటాన్ని గమనించింది. ఆపై చికిత్స కూడా చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చెంగిస్ పోస్టు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలై కూర్చుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.