గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (16:22 IST)

యోగా డే.. హైలైట్ ఇదే.. ఫోటోలు వైరల్..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రపంచ జనులంతా యోగాసనాలు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట యోగా డేకే హైలైట్‌గా నిలిచిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.
  

ఆసియా ఖండంలోనే యోగాకు ప్రత్యేక స్థానముంది. అలాంటి యోగాను గుర్తించే రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోని ఎన్డీయే సర్కారు జూన్ 21వ తేదీన అమల్లోకి తీసుకొచ్చేంది. 
 
ఇందుకోసం ఐరాస కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మోదీ సర్కారు రెండోసారి కేంద్రంలో కొలువుదీరిన అనంతరం వచ్చిన ఈ యోగా డేను మోదీతో పాటు దేశ ప్రజలు, రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు యోగసనాలు వేసి మరీ జరుపుకుంటున్నారు. 
 
ఇంకా భారత సైన్యంలోని ఆర్మీ డాగ్ యూనిట్ కూడా ఇందులో పాల్గొంది. యోగా డే సందర్భంగా డాగ్ యూనిట్ సభ్యులు, శునకాలతో కలిసి యోగసనాలు వేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను భారీ ఎత్తున జనం షేర్ చేసుకుంటున్నారు. ఇంకా లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.