మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2019 (17:42 IST)

అప్పుడు అమ్మాయిలతో బ్రాలు తీయించారు... ఇప్పుడు అబ్బాయితో పాస్ పోయించారు...

కేరళలో పరీక్షలొస్తున్నాయంటే విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేదో పరీక్ష పేపర్లను చూసి కాదు... పరీక్షలకు హాజరైనప్పుడు అక్కడి ఇన్విజిలేటర్లు ప్రవర్తిస్తున్న తీరుతో. ఆమధ్య నీట్ పరీక్షకు హాజరైన 25 మంది అమ్మాయిల చేత బ్రా తీసేయించారు ఇన్విజిలేటర్. ఈ దారుణం ఏంటని ప్రశ్నించినందుకు బ్రాకి మెటల్ హుక్స్ వున్నాయంటూ బుకాయించడం గమనార్హం. అప్పట్లో దీనిపై యువతి ఫిర్యాదు కూడా చేసింది.
 
ఇక ఇప్పుడు మరోసారి ఇన్విజిలేటర్ చేసిన పనికి పరీక్ష రాసే విద్యార్థి హాలులోనే పాస్ పోసేశాడు. వివరాల్లోకి వెళితే... పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ఓ విద్యార్థి టాయిలెట్‌ వస్తోందంటూ మూడుసార్లు ఇన్విజిలేటర్‌ను పర్మిషన్ అడిగాడు. ఐతే అందుకు మహిళా ఇన్విజిలేటర్ నిరాకరించడంతో అతడు ఆపుకోలేకపోయాడు. దీనితో పరీక్ష హాల్లోనే బాత్రూమ్‌కి వెళ్లాడు.
 
పరీక్ష పూర్తయిన తర్వాత కాని ఈ విషయం బయటకు వచ్చింది. దీనితో ఇన్విజిలేటర్ ప్రవర్తనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఇలా ప్రవర్తించడం దారుణమనీ, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.