సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (09:34 IST)

బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై వేసింది.. బుద్ధిచెప్పాలనే చంపేశా?

తన చేత పేపరుపై బూతు పదాలు రాయించుకుని ట్యూషన్ టీచర్‌పై విసిరివేసింది. దాన్ని చూసిన ఆమె తనను అందరి ముందు తిట్టింది. దీంతో ఆ యువతికి ఎలాగైనా బుద్ధిచెప్పాలన్న ఉద్దేశ్యంతో హత్య చేసినట్టు ఓ నిందితుడు వెల్లడించాడు. అందరి ముందు అవమానించేలా చేసినందుకే పగతో రగిలిపోయి ఆ యువతిని హత్య చేసినట్టు అతను వెల్లడించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన 17 యేళ్ళ యువకుడు, ఓ యువతి ఒకే టీచర్ వద్దకు ట్యూషన్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై ఆ యువకుడు మనసుపడ్డాడు. దీంతో అతనికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఆ యువతి ప్లాన్ వేసింది. 
 
ఓ రోజున ట్యూషన్‌లో పేపరుపై కొన్ని బూతు పదాలు రాయాల్సిందిగా కోరింది. దీంతో ఆ యువకుడు తనకు తెలిసిన అసభ్య పదాలను పేపరుపై రాసి ఆ యువతి చేతికి ఇచ్చాడు. ఈ పేపరును ఆ యువతి ట్యూషన్ టీచరు‌పైకి విసిరివేసింది. 
 
దీన్ని చూసిన టీచర్.. ఆ పదాలను చదివి.. యువకుడిని అందరిని ముందు తిట్టింది. దీంతో ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించి, ఆమెను హత్య చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.