గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (10:15 IST)

లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను.. తీసుకోండి..

Ox
Ox
లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను అంటూ ఓ రైతు కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో సవనూర్ మున్సిపాలిటీకీ చెందిన ఎల్లప్ప రానోజీ అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. 
 
లంచం సమర్పించినా పని కాలేదు. అంతేగాకుండా ఆ అధికారి కూడా బదిలీ అయ్యాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం ఇవ్వాలన్నాడు. ఇక చేసేది లేక రైతు ఎల్లప్ప తనకున్న ఎద్దుల్లో ఒకదానిని లంచంగా కార్యాలయానికి తీసుకువచ్చి.. డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లంచం పై అధికారులు స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.