శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (18:30 IST)

ప్రణయ్ హత్య కేసు... మారుతీరావు మావద్ద లేడు... ఎవ్వర్నీ అరెస్ట్ చేయలేదు... ఎస్పీ

మిర్యాలగూడలో పట్టపగలే హత్య చేయబడ్డ ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకూ ఎవర్నీ తాము అదుపులోకి తీసుకోలేదని ఎస్పీ రంగనాథ్ వివరించారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదనీ, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తన

మిర్యాలగూడలో పట్టపగలే హత్య చేయబడ్డ ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకూ ఎవర్నీ తాము అదుపులోకి తీసుకోలేదని ఎస్పీ రంగనాథ్ వివరించారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదనీ, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి హత్యకు ప్రధాన కారకుడు అమృత తండ్రి మారుతీరావు అంటూ ప్రణయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను నిందితుడిగా చేర్చామన్నారు.
 
సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామనీ, అందులో హత్య చేసిన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పరారీలో వున్నవారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కాగా తన భర్తను చంపినవారిని కఠినంగా శిక్షించాలంటూ అమృత డిమాండ్ చేస్తోంది.