శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (15:06 IST)

ప్రణయ్‌కి రూ.3కోట్ల ఆఫర్.. వద్దని అమృతను పెళ్లి చేసుకున్నాడు.. అందుకే?

దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ప్రణయ్ కోసం ఇంటిని వదిలి బయటికొచ్చి వివాహం చేసుకున్న అమృతవర్షిణి.. భర్తలేడనే విషయాన్ని తెలుసుకుని బోరున విలపిస్తోంది. కడుపులో ప్రణయ్

దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ప్రణయ్ కోసం ఇంటిని వదిలి బయటికొచ్చి వివాహం చేసుకున్న అమృతవర్షిణి.. భర్తలేడనే విషయాన్ని తెలుసుకుని బోరున విలపిస్తోంది. కడుపులో ప్రణయ్ బిడ్డ పెరుగుతున్నాడనే విషయం సంతోషంగా వున్నా.. ప్రణయ్ పక్కన లేడని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకుని అమృతవర్షణి వాపోతోంది. ప్రణయ్‌ని దూరం చేస్తే పుట్టింటికి వెళ్లిపోతాననే తండ్రి ఇలా చేశాడని.. అయినా తాను పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని అమృతవర్షిణి తెలిపింది. 
 
ప్రస్తుతం మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు అమృతవర్షిణి ఫ్యామిలీ డాక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం భర్తలేడనే ఒత్తిడిలో అమృత వుందని.. బీపీ పెరుగుతూ, తగ్గుతూ వుందని డాక్టర్ తెలిపారు. మిర్యాలగూడలోని ఆస్పత్రిలో అమృత పుట్టిందని.. అదే ఆస్పత్రిలోనే ప్రస్తుతం ఆమెకు చెకప్స్ చేయించుకునేదని డాక్టర్ చెప్పారు. అమృత కోసం తన కోసం బిజినెస్ ప్రారంభించాలని తనతో ప్రణయ్ చెప్పాడని డాక్టర్ తెలిపారు. అవే ప్రణయ్ తనతో మాట్లాడిన చివరి మాటలని డాక్టర్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రణయ్, వర్షిణి ప్రేమించుకున్న విషయం అమృత తండ్రి మారుతీరావుకు పూర్తిగా ఇష్టం లేదని.. ప్రేమను భగ్నం చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడని పోలీసులు అంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు కుటుంబం సంపన్నమైన కుటుంబంగా చెబుతున్నారు. ప్రణయ్ ఫ్యామిలీ కూడా ఎగువ మధ్య తరగతి కుటుంబమే. మారుతీరావుకు ఒక్కతే కూతురు కావడంతో ప్రేమ పెళ్లిని అంగీకరించలేకపోయాడు.
 
అయితే తన కూతురును మరిచిపోవాలని ప్రణయ్‌కి మారుతీరావు రూ.3కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కానీ ప్రణయ్ అంగీకరించలేదని.. మారుతీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. చివరికి ప్రణయ్, అమృతను పెళ్లి చేసుకోవడం వైపే మొగ్గు చూపాడు. కానీ ప్రణయ్ నుంచి కూతురుని వేరు చేసేందుకు నటించి.. అతడిని చంపించినట్లు మారుతీ రావుపై ఆరోపణలు వస్తున్నాయి.