శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (18:15 IST)

ఒకే కూతురు ఇలా చేసింది.. జీర్ణించుకోలేకే ప్రణయ్‌ని చంపించారా? పోలీసుల అనుమానం

మిర్యాలగూడలో నడిరోడ్డుపై హత్యకు గురైన ప్రణయ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టంలేక ప్రణయ్‌న

మిర్యాలగూడలో నడిరోడ్డుపై హత్యకు గురైన ప్రణయ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టంలేక ప్రణయ్‌ని మారుతీరావే హత్య చేయించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పోలీసులు నిందితుడు మారుతీరావుని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 
 


హత్య గురించి విచారణ జరుగుతోంది. ఇంకా తానే ప్రణయ్‌ని హత్య చేసినట్లు అమృత తండ్రి అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రణయ్ అంటే నచ్చదని అందుకే హత్య చేయించానని మారుతీరావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

తమకున్న ఒకే ఒక్క కూతురు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్నిజీర్ణించుకోలేకే ఈ హత్యను మారుతీ రావు చేయించివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శుక్రవారం మిర్యాలగూడలో పట్టపగలు నడిరోడ్డుపై ప్రణయ్ అనే యువకుడిని ఓ వ్యక్తి కత్తితో నరికి చంపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.